ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నుల పండువగా విజయవాడలో 'లక్ష దీపోత్సవం' - lakshadeepostavam at krishna dist

కార్తికమాసం సందర్భంగా విజయవాడ నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.  హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్, ధర్మజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష దీపోత్సవం, శివ కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.

విజయవాడలో      కన్నుల పండువగా లక్షదీపోత్సవం

By

Published : Nov 10, 2019, 9:58 AM IST

కృష్ణా జిల్లా విజయవాడలోని కానూరు నారాయణ కెనడి పాఠశాల మైదానం శివనామస్మరణతో మారుమోగింది. హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్, ధర్మజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష దీపోత్సవం... శివ కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన కార్తీక మాసంలో దివ్య జ్యోతులను వెలిగించారు. ఈ కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు పాల్గొన్నారు. ఈ వేడుకలో సాంస్కృతిక నృత్యాలు అలరించాయి.

విజయవాడలో కన్నుల పండువగా లక్షదీపోత్సవం

ABOUT THE AUTHOR

...view details