ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవోపేతంగా కార్తిక పౌర్ణమి దీపార్చనలు - మోపిదేవి దేవాలయంలో వైభవోపేతంగా జ్వాలా తోరణం

కృష్ణా జిల్లాలోని వివిధ ఆలయాల్లో.. కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో జ్వాలా తోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ, మైలవరం భ్రమరాంబిక మల్లికార్జున ఆలయాల్లోనూ ప్రజలు దీప ప్రజ్వలన గావించారు.

kartika deepotsavam
కార్తీక పౌర్ణమి ఉత్సవాలు

By

Published : Nov 29, 2020, 9:36 PM IST

కార్తిక పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జ్వాలా తోరణం వెలిగించారు. పండితులు, అర్చకులు వేదమంత్రాల నడుమ.. చల్లపల్లి ఎస్టేట్ దేవస్థానాల సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి జీవీడీఎన్ లీలాకుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామికి హారతి ఇచ్చిన దీపంతో.. ధ్వజస్తంభం వద్ద వరిగడ్డిని వేలాడ దీసి నిప్పంటించారు. భక్త మహాశయులు వీక్షించుచుండగా కన్నులపండుగగా జ్వాలా తోరణం నిర్వహించారు.

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయం పక్కనున్న మున్నేరులో నదీ హారతి వైభవోపేతంగా జరిగింది. కొవిడ్ నిబంధనల వల్ల భక్తులను అనుమతించలేదు. తోట్లవల్లూరు శివాలయంలోనూ దీపాలతో మహాలింగార్చన గావించారు.

మైలవరంలోని శ్రీ భ్రమరాంబిక మల్లి కార్జున స్వామి దేవస్థానంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. కొవిడ్ నిబంధనను పాటించి.. ఆలయ ముఖ ద్వారం వద్ద దీప ప్రజ్వలన చేశారు.

ఇదీ చదవండి:

నిరాశ్రయుల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details