ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రపంచ కమ్యూనిస్టులందరూ ఏకమవ్వాలి: రామకృష్ణ - cpm

కారల్ మార్క్స్ 201వ జయంతి వేడుకలను వామపక్షాలు కలిసి నిర్వహించాయి. ఆయన సిద్ధాంతాలను ఎల్లప్పుడూ పాటిస్తామని ప్రతిన బూనాయి.

కారల్ మార్స్క్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న వామపక్షాలు

By

Published : May 5, 2019, 4:02 PM IST

కారల్ మార్క్స్ 201వ జయంతి వేడుక
తత్వవేత్త, సామాజికవేత్త, సోషలిస్ట్ విప్లకారుడైన కారల్ మార్క్స్ జయంతి వేడుకలను వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించారు. చల్లపల్లి బంగ్లా వద్ద ఉన్న మార్క్స్ విగ్రహానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. మార్క్స్ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోయేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులు అంతా ఏకమవ్వాలని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. దేశంలో పెట్టుబడి దారులు, కార్పొరేట్​వాదులకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందని ఆరోపించారు. కార్మికులు పోరాడి తెచ్చుకున్న హక్కులనూ కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే ప్రపంచంలోని కమ్యూనిస్టులందరూ ఏకమవ్వాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details