కాపులకు పెద్దన్న మాదిరిగా సీఎం జగన్మోహన్రెడ్డి(cm jagan mohan reddy) అండగా ఉన్నారని... అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు(Kapu Corporation chairman Adapa Sheshu) అన్నారు. వైకాపా అందిస్తున్న సంక్షేమ పాలన చూసి తెదేపా నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
'కాపులకు సీఎం జగన్ పెద్దన్నలాగా అండగా ఉన్నారు' - Adapa Sheshu angry on tdp leaders
వైకాపా అందిస్తున్న సంక్షేమ పాలన చూసి తెదేపా నేతలు ఓర్వలేకపోతున్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు(Kapu Corporation chairman Adapa Sheshu) విమర్శించారు. కాపులకు పెద్దన్నలాగా సీఎం జగన్ (cm jagan) అండగా ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ సినీ హీరో మాత్రమే నిజ జీవితంలో హీరో కాదన్నారు. మంత్రి పేర్ని నానిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు
కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు
మంత్రి హోదాలో ఉన్న పేర్ని నాని(perni nani)పై పవన్ కల్యాణ్ (pawan kalyan)చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అడపా శేషు అన్నారు. పవన్ కల్యాణ్ సినీ హీరో మాత్రమే నిజ జీవితంలో హీరో కాదన్నారు. పవన్ కల్యాణ్, చిరంజీవి సినిమాలను ఆడించడానికి కాపులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారన్నారు. కాపులను జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలనే కుట్ర జరుగుతుందని.. ఆవేశంతో కాకుండా ఆలోచనతో అంతా ఐక్యంగా ఉండాలని కోరారు.
ఇదీ చదవండి