ఆహార, వాణిజ్య పంటల మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. వరి క్వింటాకు 53 రూపాయలు, కందులు 200 రూపాయలు, మినుములు 300 రూపాయల చొప్పున పెంచిన మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర రైతాంగం తరపున కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
పంటకు మద్దతు ధరపెంపుపై కన్నాలక్ష్మీనారాయణ హర్షం - ఆహార, వాణిజ్య పంటల మద్దతు ధర పెంపు వార్తలు
పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగం తరపున కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
kanna thanks to modi latest tweets