ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నా, విజయసాయి రెడ్డి మధ్య ట్వీట్ల పోరు - కన్నా , విజయసాయిరెడ్డిపై మధ్య వివాదం

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ట్టీట్ల యుద్ధం నడుస్తోంది. తెదేపాకు దూరంగా ఉండాలని అధిష్టానం చెబుతున్నా కన్నా పట్టించుకోవటం లేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబుపై 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్ 'పేరుతో పుస్తకం విడుదల చేసి.. రూ.3 లక్షల అవినీతి జరిగిందని ఆరోపించారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారని కన్నా నిలదీశారు.

kanna laxmi narayana, vijyasai reddy tweet
kanna laxmi narayana, vijyasai reddy tweet

By

Published : Jul 20, 2020, 2:52 PM IST

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మధ్య ట్వీట్ల పోరు నడుస్తోంది. తెదేపాకు దూరంగా ఉండాలని అధిష్టానం చెబుతున్నా కన్నా పట్టించుకోవటం లేదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అమరావతి విషయంలో అందుకే గవర్నర్ కు లేఖ రాశారా అని ప్రశ్నించారు.

దానికి కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్టర్లో ఘాటుగా బదులిచ్చారు. తెదేపా అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్ 'పేరుతో పుస్తకం విడుదల చేశారు కదా... మీరు అధికారం చేపట్టిన తర్వాత వారి అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కన్నా ప్రశ్నించారు.

గతంలోనూ కన్నా అవినీతికి పాల్పడుతున్నారని మీడియా ముఖంగా విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు మళ్లీ ట్వట్టర్ ద్వారా కన్నాపై విమర్శలు గుప్పించారు.

విజయసాయి రెడ్డి ట్వీట్
కన్నా ట్వీట్

ఇదీ చదవండి:'దిశ చట్టం... ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయి?'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details