"ప్రభుత్వ నిర్ణయంతో పోలవరం ఆలస్యం" - bjp
పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు.
పోలవరంపై రీటెండరింగ్‌కు వెళ్తే ప్రాజెక్టు ఆలస్యమయ్యే అవకాశముందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి జరిగితే నిరూపించాల్సిన అవసరం ఉందని... అయితే చర్యలకు ప్రభుత్వం ఎంచుకున్న పద్ధతి సరైంది కాదని తెలిపారు. గతంలో పాత రేట్లకే పనిచేసేందుకు నవయుగ సంస్థను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒప్పించి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు దానిని ప్రాజెక్టు నుంచి తప్పించటం వల్ల నిర్మాణ వ్యయం పెరగటం, ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని సూచించారు.