కేంద్రం అందించిన వెయ్యి రూపాయల కరోనా సాయాన్ని వైకాపా ప్రభుత్వం తాము ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియోను పోస్టు చేసిన ఆయన.... సంక్షోభ సమయంలో కూడా స్వార్థ రాజకీయాలు తగవని విమర్శించారు. కరోనా వ్యాప్తితో దేశం, రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చిన సాయానికి వైకాపా స్టిక్కర్లు వేస్తారా అని ప్రశ్నించారు. చాలాచోట్ల వాలంటీర్లతో కలిసి వైకాపా కార్యకర్తలు ప్రచారం చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ విషయాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
'సంక్షోభంలో కూడా స్వార్థ రాజకీయమా?' - పేదలకు వెయ్యి సాయం
లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం ఇచ్చిన నిధులకు వైకాపా స్టిక్కర్లు వేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. సంక్షోభ సమయంలోనూ స్వార్థ రాజకీయాలేంటని ప్రశ్నించారు.
kanna lakshmi narayana