'ఎన్నికల్లో పాల్గొనకుండా టీఎంసీని నిషేధించాలి' - mamatha benargi
''హింసతోనే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అమిత్షా ర్యాలీలో హింస దృష్ట్యా తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేదం విధించాలని డిమాండ్ చేస్తున్నాం'': కన్నా లక్ష్మీ నారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
పశ్చిమ బంగాలో జరుగుతున్న హింసా వాదాన్ని చూస్తుంటే దేశంలో ప్రజా స్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బంగాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో జరిగిన దాడిని విజయవాడలో ఖండించారు. హింస ద్వారానే మమతా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రాంతీయ పార్టీల వైఖరి మొత్తం ఇలానే ఉందన్న కన్నా... ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లా వ్యవహరిస్తున్నాయన్నారు. ఎన్నికల్లో పాల్గొనకుండా తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.