రాష్ట్రంలో బలవన్మరణాలకు పాల్పడ్డ నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నాచౌక్ వద్ద భాజపా ఆధ్వర్యంలో జరిగిన ఇసుక సత్యాగ్రహంలో పాల్గొన్న ఆయన.. వైకాపా ప్రభుత్వం ఐదు నెలల పాలనలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. సీఎం జగన్ పాలనపై పట్టు కోల్పోయారన్నారు. నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
'కార్మిక కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారమివ్వాలి' - ఇసుక కొరతతో ఆత్మహత్యలు వార్తలు
వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
kann-laxmi-naryana-demond-for-25-lakh-compensation-for-working-families-who-commit-suicide
TAGGED:
ఏపీలో ఇసుక కొరత వార్తలు