ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ycp leaders join tdp : వైకాపాకు ఎదురు దెబ్బలు.. భారీగా సైకిల్ ఎక్కుతున్న నేతలు - ఏపీ న్యూస్

రాష్ట్రంలో తెదేపాలోకి వలసలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ వైకాపా నుంచి.. నేతలు, కార్యకర్తలు భారీగా సైకిల్ ఎక్కుతున్నారు. నిన్న తూ.గో. జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన శ్రేణులు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో పెద్ద ఎత్తున(ycp leaders join tdp) పార్టీలో చేరారు. ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరి నేతలు తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు.

Kanigiri YCP Leaders
Kanigiri YCP Leaders

By

Published : Oct 8, 2021, 12:35 PM IST

రాష్ట్రంలో తెదేపాలోకి వలసలు కొనసాగుతున్నాయి. తూ.గో. జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన వైకాపా శ్రేణులు నిన్న (గురువారం) తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. నిన్న సాయంత్రం తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో.. చంద్రబాబు వారికి(ycp leaders join tdp) పార్టీ కండువాలు కప్పారు.

ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వైకాపా నేతలు తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. చంద్రబాబు సమక్షంలోనే నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరనున్నారు. నియోజకవర్గ ఇంఛార్జ్ ఉగ్రనరసింహరెడ్డి ఆధ్వర్యంలో చేరికలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి జగన్, వైకాపా విధానాలు నచ్చకనే.. చాలా మంది నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరుతున్నట్టు(ycp leaders join tdp) పలువురు నేతలు తెలిపారు.

ఇదీ చదవండి: Gold Rate Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details