కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణ పనుల్లో గ్రావెల్కు బదులు బూడిద వాడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఫలితంగా... తక్కువ కాలంలోనే రోడ్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంచికచర్ల వద్ద అండర్పాస్ నిర్మించాలని మూడేళ్లుగా కోరుతున్నా... పట్టించుకోవటం లేదంటూ స్థానికులు వాపోయారు. పనుల చేస్తున్నప్పుడు వచ్చే కాలుష్యానికి... రోడ్డుకు దగ్గరగా ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నామంటూ పేర్కొన్నారు. 15 నెలల్లో జాతీయ రహదారి పనులు పూర్తి చేయాల్సి ఉండగా... ఇప్పటికీ సగం పనులు కూడా పూర్తి కాలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నత్తనడకన కంచికచర్ల బైపాస్ రోడ్డు పనులు - నెమ్మదించిన కంచికచర్ల బైపాస్ రోడ్డు పనులు
మూడేళ్లు గడుస్తున్నా... విజయవాడ-హైదరాబాద్ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు కుంటుతున్నాయి. 15 నెలల్లో పూర్తిచేయాల్సి ఉండగా... మూడేళ్లు గడుస్తున్నా ఇంకా 50 శాతం పనులు కూడా చేయలేదంటూ... స్థానికులు చెబుతున్నారు.
నత్తనడకన కంచికచర్ల బైపాస్ రోడ్డు పనులు