జగన్ అండతోనే ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. రాయచోటి సబ్ డివిజన్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వైకాపా నేతల గురించి జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పోలీసులకు దొరికిన 9మంది స్మగ్లర్లలో ప్రధాన నిందితులంతా వైకాపా వారే ఆరోపించారు.
జగన్ అండతోనే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు: కాల్వ శ్రీనివాసులు - Red sandalwood smugglers latest news
సీఎం జగన్ అండతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని తెదేపా సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. రాయచోటి సబ్ డివిజన్ పరిధిలో పోలీసులకు పట్టుబడ్డ 9 మంది స్మగ్లర్లు వైకాపాకు చెందిన వారేనని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసులకు పట్టుబడిన చిత్తూరు జిల్లా కేవిపల్లి మండల వైకాపా యువత అధ్యక్షులు గజ్జల శ్రీనివాసుల రెడ్డి, కడప జిల్లా బండపల్లెకు చెందిన మరో వైకాపా నేత సదిపిరాళ్ల రెడ్డప్పరెడ్డిపై.. కడప, చిత్తూరు జిల్లాల్లో అనేక కేసులున్నాయని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఎర్రచందనం స్మగర్లకు లైసెన్స్ ఇచ్చినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బును ఎన్నికల్లో వెదజల్లుతూ ప్రజాస్వామ్యానికి ముప్పుగా వైకాపా మారిందన్నారు. పట్టుబడిన వైకాపా నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి