ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు' - kalva srinivasulu praises pv

భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు ప్రత్యేకతే వేరని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు కొనియాడారు. పీవీ శతజయంతి సందర్భంగా ఆయన సేవలను కాలవ శ్రీనివాసులు గుర్తు చేసుకున్నారు.

kalava srinivasulu
kalava srinivasulu

By

Published : Jun 28, 2020, 4:34 PM IST

ఆధునిక భారతంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు కొనియాడారు. పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా పీవీ సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.

'తొలి తెలుగు ప్రధానిగా పీవీకి ఉన్న ప్రత్యేకత వేరెవరికి లేదు. భారత దేశాన్ని ఒక తెలుగు వ్యక్తి అత్యంత సమర్థవంతంగా పరిపాలించగలడని నిరూపించారు. ఆర్థిక సంస్కరణలతో సువిశాల భారత దేశానికి సరికొత్త మార్గాన్ని చూపించారు. ఆయన చూపిన మార్గంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు సరికొత్త పరిష్కార మార్గాలు లభించాలని ఆశిస్తున్నా' అని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:గొప్ప రాజకీయవేత్త, బహుభాషాకోవిదుడు.. పీవీ: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details