విజయవాడలోని ఎంజీరోడ్డులోని కళాంజలి షోరూమ్‌లో వివాహ వేడుకలకు అత్యంత ఆకర్షణీయంగా నవవధువు కలెక్షన్స్‌ను ఏర్పాటు చేశారు. కట్టులోని నిండుదనం, భారీ జరీ అందాలు, మదిని దోచే వర్ణాలు, కళ్లు తిప్పుకోలేని పనితనం, ఆకట్టుకునే అంచులతో పట్టుచీరలు కొలువుదీరాయి. కంచి, ధర్మవరం, ఆరణి, గద్వాల్, పోచంపల్లి, తదితర ప్రముఖ ప్రాంతాల జరీ చెక్స్, మల్టీకలర్ చెక్స్, సంప్రదాయ జరీ బోర్డర్స్, టెంపుల్ బోర్డర్స్, సాముద్రిక, ఇక్కత్, డిజైన్లతో ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయ, ఆధునిక కలయిక మేళవింపుతో నవవధువుల మనసు దోచుకునే విధంగా అత్యంత ఆకర్షణీయంగా కలెక్షన్ ఏర్పాటు చేసినట్లు కళాంజలి సీనియర్ మేనేజర్ వెంకటేష్ తెలిపారు. షోరూమ్ ఉదయం 10 గంటలనుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిపారు.
కళాంజలిలో వివాహ కలెక్షన్స్ అదుర్స్.. - కళాంజలిలో వివాహ కలెక్షన్స్ వార్తలు
కళాంజలి షోరూమ్‌లో వివాహ వేడుకలకు ఆకర్షణీయంగా నవవధువు కలెక్షన్స్‌ను ఏర్పాటు చేశారు. కట్టులోని నిండుదనం, భారీ జరీ అందాలు, మదిని దోచే వర్ణాలు, కళ్లు తిప్పుకోలేని పనితనం, ఆకట్టుకునే అంచులతో పట్టుచీరలు ఇక్కడ కొలువుదీరాయి.
Kalanjali Collections