ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముస్లింలకు సీఎం జగన్​ బహిరంగ క్షమాపణలు చెప్పాలి' - తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు వార్తలు

మైనార్టీ సోదరులను అవమానించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని తక్షణమే బర్తరఫ్ చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. మైనార్టీలంటే వైకాపాకు ఎందుకు అంత చిన్నచూపు అని మండిపడ్డారు.

kala-venkatrao-on-deputy-cm
kala-venkatrao-on-deputy-cm

By

Published : Apr 13, 2020, 1:55 PM IST

మైనార్టీలను అవమానించిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని బర్తరఫ్ చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ముస్లింలు ప్రభుత్వానికి సహకరించడం లేదనడం దుర్మార్గమన్నారు. శాసనమండలి ఛైర్మన్ షరీఫ్​ని సాక్షాత్తూ సభలోనే మంత్రి బొత్స నీచంగా మాట్లాడి ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. మైనార్టీలంతా తెదేపా వెంట ఉన్నారన్న అక్కసుతో వైకాపా నేతలు వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ముస్లింలకు జరిగిన అవమానానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు ప్రజలు భావిస్తారని కళా వెంకట్రావు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details