ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: కళా వెంకట్రావు - గోరంట్ల బుచ్చయ్య చౌదరి

విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేసి తన చిత్తశుద్ది నిరూపించుకోవాలని తెదేపా నేత కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. వైకాపా ఎంపీలు కేంద్రం వద్దకు వెళ్లి ఒత్తిడికి లోనవ్వడం తప్ప.. ఒత్తిడి తెచ్చింది లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

సీఎం రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: కళావెంకట్రావు
సీఎం రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: కళావెంకట్రావు

By

Published : Mar 9, 2021, 8:23 PM IST

ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎంపీల రాజీనామతో ఒరిగేదేమీ లేదని విజయసాయిరెడ్డి అంటున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెదేపా నేత కళా వెంకట్రావు డిమాండ్​ చేశారు.

"ముఖ్యమంత్రి రాసే లేఖలు ప్రేమలేఖలుగా మిగిలిపోతాయే తప్ప వాటితో ఉపయోగం లేదు. ఎంపీలంతా రాజీనామాలు చేస్తే.. కేంద్రం దిగివచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగనే డిమాండ్ చేశారు. మరి ఈ రోజు ఎందుకు నోరు మెదపడం లేదు. విశాఖ ఉక్కు కోసం రాష్ట్ర ప్రజలు ఉద్యమిస్తుంటే, తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ రెడ్డి లేఖలు రాస్తూ పబ్జీ గేమ్​లు ఆడుకుంటున్నారు" అని కళా వెంకట్రావు ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.

"కేంద్రం పై ఒత్తిడి తీసుకువస్తామని వైకాపా ఎంపీలంటున్నారు. మీరు ఇప్పటికి వరకు కేంద్రం వద్దకు వెళ్లి ఒత్తిడికి లోనవడం తప్ప.. ఒత్తిడి తెచ్చింది లేదు. ఏం చేస్తాం మీ పరిస్థితి అలాంటిది మరి. కేంద్రం ప్రకటనపై ఉక్కు కార్మికుల్లో ఆగ్రహావేశాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ దగ్గర ధర్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న అసమర్ధ ప్రభుత్వం... ముఖ్యమంత్రి కార్మికులతో లేదా మీడియా ముఖంగా ఎందుకు మాట్లాడం లేదు. ఈ లాలూచీ రాజకీయం దేనికి? కేంద్రం దగ్గర సాగిల పడి రాష్ట్రంలో మాత్రం ఆపేస్తాం అని రాష్ట్ర భాజపా నాయకులూ ఉత్తమ కుమారుడి ప్రగల్బాలు పలుకుతున్నారు. వీరు కూడా దీనికి సమాధానం చెప్పాలి" -ట్విట్టర్ లో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఇదీ చదవండి:ఏలూరులో ఎన్నికలు జరుపుకోవచ్చు: హైకోర్టు డివిజన్ బెంచ్‌

ABOUT THE AUTHOR

...view details