ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం నగదు బదిలీ పేరుతో కుట్రకు తెరలేపింది: కళా వెంకట్రావు - ఉచిత విద్యుత్ వార్తలు

సీఎం జగన్ రైతులను అప్పులపాలు చేయబోతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు మండిపడ్డారు. ఉచిత విద్యుత్​ను పథకాన్నిఎత్తివేసేందుకు వైకాపా ప్రభత్వం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. సజావుగా సాగుతున్న ఉచిత పథకంలో నగదు బదిలీ చేపట్టడం రైతులను ఇబ్బంది పెట్టడానికేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

kala venkatrao comments on cm jagan
తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు

By

Published : Sep 2, 2020, 10:17 AM IST

ఉచిత విద్యుత్​కు నగదు బదిలీ పథకం పెడతామనేది ఒక తుగ్గక్ నిర్ణయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసమే సౌర విద్యుత్ అని చెప్పడం కూడా... బూటకమేనన్నారు. మీటర్లు ఎందుకు పెడుతున్నారని .... ఇది రైతు ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతిస్తోందని మండిపడ్డారు. జగన్ విధానాల వల్ల రైతులు మరింత దెబ్బతింటారని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చే రాయితీలు రద్దు చేసి వారిని మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇది రైతుల పాలిట పిడుగుగా మారిందన్నారు. విద్యుత్ కష్టాలు తగ్గించేందుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని విమర్శించారు. విద్యుత్ సంస్థలను సమర్థవంతంగా నడపడంలో విఫలమై ..రైతులపై భారం వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం రైతులను వంచించడమేనని ఆరోపించారు. ఉచిత విద్యుత్ ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం నగదు బదిలీ పేరుతో కుట్రకు తెరలేపిందని దుయ్యబట్టారు.

ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత నిర్ణయంతో చిన్న, సన్నకారు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కనెక్షన్ ఒకరి పేరు మీద, పొలం మరొకరి పేరు మీద ఉండే వారి పరిస్థితి ఏంటని నిలదీశారు.. ఇలాంటి చర్యలతోనే రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదని.. రాష్ట్రంలోనే ఎవరి ప్రయోజనం కోసం ప్రవేశపెడుతున్నారని నిలదీశారు.

ఇదీ చూడండి.సెక్యూరిటీల వేలంతో రూ.3వేల కోట్ల రుణం

ABOUT THE AUTHOR

...view details