ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సభాపతి వ్యాఖ్యలపై సీఎం సమాధానం చెప్పాలి: కళా - కళా వెంకట్రావు తాజా వార్తలు

రాష్ట్రంలో లాక్​డౌన్ కొనసాగుతున్న క్రమంలో సారా ఏరులై పారుతుందన్న సభాపతి తమ్మినేని వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని తెలుగుదేశం నేత కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. జగన్ వైఖరి చూస్తుంటే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్​ కేంద్రాల్లో కూడా పోలింగ్ బూతులు పెట్టి ఎన్నికలు నిర్వహించేట్లు ఉన్నారని కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు.

kala-venkatrao
kala-venkatrao

By

Published : Apr 25, 2020, 12:20 PM IST

లాక్​డౌన్ వేళ రాష్ట్రంలో సారా ఏరులై పారుతుందన్న సభాపతి తమ్మినేని వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని తెలుగుదేశం నేత కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. ఆబ్కారీశాఖ మంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలన్నారు. నిత్యావసరాలైన పాలు, నీళ్లు దొరకడం కష్టంగా ఉన్న ఈ సమయంలో మద్యం మాత్రం వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పని చేస్తూ ప్రజలకు ధైర్యాన్ని అందిస్తుంటే జగన్ మాత్రం తాడేపల్లికే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. జగన్ వైఖరి చూస్తుంటే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాల్లో కూడా పోలింగ్ బూతులు పెట్టి ఎన్నికలు నిర్వహించేట్లు ఉన్నారని కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details