వైకాపా ఏడాది పాలనలోనే 108 సేవల నిర్వహణను విజయసాయిరెడ్డి వియ్యంకుడి సంస్థ అరబిందోకు అధిక రేటుకు కట్టబెట్టారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు దుయ్యబట్టారు. తెదేపా హయాంలో ఒక వాహనానికి సేవల నిర్వహణకు నెలకు 1.31లక్షల రూపాయలు ఇవ్వగా... దాన్ని జగన్ ప్రభుత్వం 2.21 లక్షల రూపాయలకు పెంచి ఇవ్వడం అవినీతి కాదా అని నిలదీశారు. వైకాపా అబద్ధాలను వినే పరిస్థితిలో ప్రజలు లేరని కళా వెంకట్రావు అన్నారు.
1300 కోట్ల రూపాయల విలువైన 613 హెక్టార్ల సున్నపురాయి గనులను జగన్ కుటుంబానికి కట్టబెట్టడం అనినీతి, అధికార దుర్వినియోగం కాదా? అని కళా వెంకట్రావు నిలదీశారు. 7.96 కోట్ల రూపాయల పనికి కేవలం సిఫారసు లేఖ ఇచ్చినందుకు అచ్చెన్నాయుడుని అరెస్టు చేస్తే.... దానికి 3 కోట్ల రూపాయల బిల్లు ఇచ్చినందుకు వైకాపా మంత్రిని ఏం చేస్తారో చెప్పాలని కళా డిమాండ్ చేశారు.