ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వీలైనంత త్వరగా కడప ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభం కావాలి' - కడప ఉక్కుపరిశ్రమ వార్తలు

కడప ఉక్కుపరిశ్రమ, కొప్పర్తి ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. అలాగే క్లస్టర్ ఏర్పాటు కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

cm jagan
cm jagan

By

Published : Oct 26, 2020, 6:06 PM IST

వీలైనంత త్వరగా కడప ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభం కావాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కరవు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్‌ ప్లాంట్‌ను తీసుకొస్తున్నామని చెప్పారు. సోమవారం కడప ఉక్కుపరిశ్రమ, కొప్పర్తి ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని... వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేస్తామని వెల్లడించారు. అందుకు కనీసం 7 వారాల సమయం పడుతుందన్నారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3- 4 నాలుగు వారాల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతిపాదనలు స్వీకరించిన వెంటనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. కంపెనీల ప్రతిపాదనల స్వీకరణకు ముందు ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలి ఉంటే వాటిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు.

30వేల ఉద్యోగాల కల్పన లక్ష్యం

కడప జిల్లా సమీపంలో కొప్పర్తి వద్ద ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ సమీక్షించిన సీఎం... దీని కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. రూ.300 కోట్ల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్‌ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని అధికారులు వివరించారు. ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందన్నారు. డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలని వారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం కావాలని చెప్పారు.

ఇదీ చదవండి

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రూ. కోటి ప్రోత్సాహకం: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details