ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మునుగోడు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయి: కేఏ పాల్ - మునుగోడు ఎన్నికల కౌంటింగ్​పై కేఏ పాల్ స్పందన

తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల ఫలితాలపై కేఏ పాల్ స్పందించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారంటూ విమర్శించారు. ఈ ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌ పేపర్లతో జరపాలని కోరినప్పటికీ ఈసీ స్పందించలేదని విమర్శించారు. ఎన్నికల వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామని కేఏ పాల్‌ వెల్లడించారు.

మునుగోడు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయి
మునుగోడు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయి

By

Published : Nov 6, 2022, 12:53 PM IST

Updated : Nov 6, 2022, 2:45 PM IST

మునుగోడు ఉపఎన్నిల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు. మద్యం, డబ్బుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలతో కాకుండా.. ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లతో జరపాలని కోరినప్పటికీ ఈసీ స్పందించలేదని ధ్వజమెత్తారు. ఎన్నికలలో భారీ స్థాయిలో ప్రలోభాలు జరిగాయని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని కేఏ పాల్​ తెలిపారు.

మునుగోడు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయి

"బ్యాలెట్ పేపర్లు పెట్టండి.. ఈవీఎంలు వద్దని చెప్పాం. ఓట్లు ఆయన వెంటనే లెక్కపెట్టండని చెప్పాం. వీటిని సెంట్రల్ ఫోర్స్​తో నడపమని చెప్పాం. కలెక్టర్, ఎస్పీ, ఆర్వో వారందరూ కేసీఆర్​కు చెందిన వారు. ఇదంతా ప్లాన్​గా జరిగింది. 3వతేదీన ఎలక్షన్ జరిగింది. 4వతేదిన కౌంటింగ్ చేయలేదు. ఖచ్చితంగా అవినీతి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతికి పాల్పడ్డాయి. ఇవి అవినీతి ఎన్నికలు. ఈ ఎన్నికలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్​తో ఎన్నికలు నిర్వహించాలి. మొత్తం 47 మంది అభ్యర్థులలో 37 మంది కోరుకుంటున్నారు." - కేఏ పాల్‌, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated : Nov 6, 2022, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details