తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు జోగి రమేష్, విడదల రజని, పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఫూలే సేవలను నేతలు కొనియాడారు. సమాజహితం కోసం తీసుకువచ్చిన సంస్కరణలను కొనియాడారు. పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం పూలే ఆశయ సాధన కోసం పాటుపడుతోందని మంత్రి, నేతలు అన్నారు.
'పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' - తాడేపల్లిలో మహాత్మ జ్యోతి రావు ఫూలే జయంతి కార్యక్రమం
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి తాడేపల్లిలో వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు.

తాడేపల్లిలో మహాత్మ జ్యోతి రావు ఫూలేకి నివాళులు
TAGGED:
తాడేపల్లి తాజా వార్తలు