ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

new cj of ap high court: హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం

new cj of ap high court
new cj of ap high court

By

Published : Oct 13, 2021, 1:11 PM IST

Updated : Oct 14, 2021, 3:12 AM IST

13:09 October 13

జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్‌

హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం

రాష్ట్ర హైకోర్టు మూడో ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు (new cj of ap high court justice prashant kumar mishranews). విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్(ap governor).. ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్(cm jagan news) .. నూతన సీజేకు పుష్పగుచ్ఛం అందించారు.

ఛత్తీస్‌గడ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌(Justice Prashant Kumar Mishra news) మిశ్ర పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వచ్చారు(ap high court cj news). 2009 డిసెంబర్​లో ఛత్తీస్‌గడ్ న్యాయమూర్తిగా నియమితులైన ప్రశాంత్​ కుమార్ మిశ్ర..అక్కడి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర మూడో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ప్రస్థానం

జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జన్మించారు. బిలాస్‌పుర్‌లోని గురుఘసిదాస్‌ వర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాయ్‌గఢ్‌ జిల్లా కోర్టుతో పాటు, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2005 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ద్వారా సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. ఆ రాష్ట్రానికి బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా సేవలు అందించారు. హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2004 జూన్‌ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా సేవలు అందించారు. 2007 సెప్టెంబరు 1 నుంచి అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. 2009 డిసెంబరు 10న ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వచ్చారు.

ఇదీ చదవండి

'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు

Last Updated : Oct 14, 2021, 3:12 AM IST

ABOUT THE AUTHOR

...view details