హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇవాళ ప్రమాణం చేయనున్న జస్టిస్ జితేంద్ర కుమార్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
విభజన తర్వాత తొలి ప్రధాన న్యాయమూర్తి...
విభజన అనంతరం మొదటిసారి శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తోన్న జితేంద్ర కుమార్ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1961 జూన్ 21న జన్మించిన జితేంద్ర కుమార్ మహేశ్వరి 1985 నవంబరు 22న న్యాయవాదిగా నమోదయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులోనే కొంతకాలం సివిల్, క్రిమినల్, రాజ్యాంగ వ్యవహారాల న్యాయవాదిగా పనిచేశారు. 2005లో మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులై... మూడేళ్ల తర్వాత శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.
ఇదీ చూడండి:
'ఎస్వీఆర్ తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం'