ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇంజినీరింగ్​ ఫీజులు పెరిగే అవకాశం లేదు' - జస్టిస్ ఈశ్వరయ్య

కోర్టు కేసుల కారణంగా... ఇంజినీరింగ్, పీజీ, యూజీ కళాశాలల ఫీజుల నిర్ణయం ఆలస్యమైందని... ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య తెలిపారు. ఫీజుల వివరాలను ఫిబ్రవరి 4వ తేదీ నాటికి నిర్ణయిస్తామని వెల్లడించారు.

జస్టిస్‌ ఈశ్వరయ్య, ఏపీహెచ్‌ఈఆర్‌ఎమ్‌సీ ఛైర్మన్‌
జస్టిస్‌ ఈశ్వరయ్య, ఏపీహెచ్‌ఈఆర్‌ఎమ్‌సీ ఛైర్మన్‌

By

Published : Jan 30, 2020, 8:28 AM IST

ఇంజినీరింగ్​ ఫీజులపై వివరాలు వెల్లడిస్తున్న జస్టిస్​ ఈశ్వరయ్య

ఇంజినీరింగ్‌, పీజీ, యూజీ కళాశాలలకు సంబంధించిన ఫీజుల వివరాలను.... ఫిబ్రవరి 4వ తేదీ నాటికి నిర్ణయిస్తామని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య తెలిపారు. కోర్టు కేసులు కారణంగా ఫీజుల నిర్ణయం ఆలస్యమైందని విజయవాడలో వెల్లడించారు. నవంబర్ 27 నుంచి ఇప్పటి వరకూ చేసిన తనిఖీల్లో... నిబంధనలు గాలికొదిలేసి కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసమే నడుస్తున్న కళాశాలలను గుర్తించామని, వాటిపై త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది ఫీజులు పెరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details