ఎన్ఎంసీ బిల్లును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్డులో జూనియర్ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. వీరికి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటీవ్స్ మద్దతు పలికారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో ధర్నా నిర్వహించారు. ఆస్పత్రిలో జూడాలు సేవలు నిలిపివేయగా.. సీనియర్లు సేవలు కొనసాగించారు. బిల్లుకు చట్టసవరణలు చేయాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. శుక్రవారం నుంచి 15 వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే... ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన
జాతీయ మెడికల్ కమిషన్కు వ్యతిరేకంగా జూడాలు ఆందోళన నిర్వహించారు. వీరి పోరాటానికి మెడికల్ ఆండ్ సేల్స్ రిప్రజెంటేటీవ్స్ మద్ధతు పలికారు.
జూనియర్ డాక్టర్ల ర్యాలీ