ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ తీరు నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆందోళన - పాయకపూరం

విజయవాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. తమకు సంబంధించిన అనేక సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థుల ధర్నా

By

Published : Jul 18, 2019, 1:44 PM IST

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థుల ధర్నా

విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని... అలాగే విద్యార్థులకు చెందిన అనేక సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించాలని విద్యార్ధి సంఘాల నేతలుడిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details