ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీమా సౌకర్యంపై లోకేశ్​కు పాత్రికేయుల కృతజ్ఞతలు - నారా లోకేశ్ జర్నలిస్టులకు బీమా సౌకర్యం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తమకు బీమా సౌకర్యం కల్పించడంపై విలేకరులు ఆనందం వ్యక్తంచేశారు. ప్రభుత్వం కూడా ఈ సౌకర్యం కల్పించాలని కోరారు.

journalists feels happy as nara lokesh provides insurance for them
నారా లోకేశ్ బీమా సౌకర్యం కల్పించడంపై పాత్రికేయుల హర్షం

By

Published : Aug 18, 2020, 11:12 PM IST

క‌రోనా క‌ష్టకాలంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్ త‌మ‌కు క‌ల్పించిన ఇన్సూరెన్స్ సౌక‌ర్యం వ‌ల్ల భ‌రోసా దొరికింద‌ని జ‌ర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు బీమా సౌక‌ర్యం క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.

మంగ‌ళ‌గిరిలోని ఎంఎస్​ ఎస్ భ‌వ‌న్‌లో తెదేపా నాయకులు... జ‌ర్నలిస్టుల‌కు ఇన్సూరెన్స్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. బీమా పొందిన జ‌ర్నలిస్టు స‌హ‌జ‌మ‌ర‌ణం లేదా కోవిడ్ వ‌ల్ల చనిపోయినా రూ.10 ల‌క్షలు, ప్రమాదంలో మృతిచెందితే రూ.20 ల‌క్షల‌ను అందచేస్తారని తెదేపా నేతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details