రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలోని రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గోడ ప్రతులను జేసీ ఆవిష్కరించారు. రైతులకు పశు సంరక్షణ కార్డులను పంపిణీ చేశారు. నూజివీడు ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర, ఏడీఏ జయప్రద. ఏవో ఎన్.ఎల్. తేజస్వీ, ఎంపీడీవో సుభాషిణి, తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
'రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం' - gannavaram latest news
గన్నవరంలో మండలం చిన్నఅవుటపల్లి రైతు భరోసా కేంద్రంలో జరిపిన రైతు దినోత్సవంలో జాయింట్ కలెక్టర్ కె.మాధవిలత, సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.
చిన్న అవుటపల్లి రైతు భరోసా కేంద్రంలో జరిగిన రైతు దినోత్సవం లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ మాధవిలత