ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వడదెబ్బతో ఝార్ఖండ్​ వలస కూలీ మృతి - గన్నవరం-ఉంగుటూరు సమీపంలో వలసకూలీ మృతి

వారంతా రెక్కాడితేగానీ.. డొక్కాడని వలస జీవులు... ఉపాధి వెతుకులాటలో సొంతూళ్లను వదిలి వందల కిలోమీటర్లలోని ఇతర ప్రాంతాలకు చేరుకుని కూలీనాలీ చేసుకుని బతుకీడుస్తున్నారు. లాక్​డౌన్​తో కూలీ పనులు లేక స్వస్థలాలకు పయనమవుతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో నడకనే నమ్ముకుంటూ ముందుకుసాగుతున్నారు. వందల కిలోమీటర్లు నడిచి వెళ్లే క్రమంలో ప్రాణాలను విడుస్తున్నారు.

jharkand migrant worker has died due to sunstroke in krishna district
వడదెబ్బ తగిలి ఝార్ఖండ్​కు చెందిన వలసకూలీ మృతి

By

Published : May 21, 2020, 11:36 PM IST

Updated : May 22, 2020, 9:35 AM IST

వారంత ఝార్ఖండ్​కు​ చెందిన వలస కూలీలు...లాక్​డౌన్​తో చెన్నైలో చిక్కుక్కుపోయారు. రవాణా సౌకర్యం లేక స్వస్థలాలకు నడిచుకుంటూ వెళ్లేందుకు సిద్ధమైయ్యారు. ఇలా 19 మంది వలసకూలీలు ఝార్ఖండ్​కు బయల్దేరారు. కృష్ణా జిల్లా గన్నవరం- ఉంగుటూరు చేరుకునేసరికి వారిలో ఒకరైన అనిల్​ సర్కార్ అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వడదెబ్బతో ప్రాణాలు వదిలాడు. ఈ క్రమంలో తోటి కూలీలకు అనిల్ మృతదేహాన్ని ఏమి చేయాలో తెలియలేదు. ఇక చేసేదేంలేక మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్నారు. ఇదంతా గమనించిన స్థానికులు ఆత్కూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగతా 18 మంది వలస కూలీలను పునరావాస కేంద్రానికి తరలించారు.

Last Updated : May 22, 2020, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details