కృష్ణాజిల్లాలో జెల్లీఫిష్ సందడి..తరలివస్తున్న పర్యటకులు - కృష్ణాజిల్లాలో జెల్లీఫిష్ సందడి
నీటిలో తెలియాడే జెల్లీ ఫిష్లను కేవలం డిస్కవరీ, జాగ్రఫీ చానెళ్లలోనే చూస్తుంటాం.. కానీ దివిసీమలో సముద్రం నుంచి నది పాయాల్లోకి చేరి సందడి చేస్తున్నాయి.
కృష్ణాజిల్లాలో జెల్లీఫిష్ సందడి
కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప బీచ్ వద్ద జెల్లీ ఫిష్లు నీటిలో తేలియాడుతూ సందడి చేస్తున్నాయి. కృష్ణా వన్యప్రాణి అభయారణ్యంలో అందమైన మడ అడవుల సోయగాలు అందమైన పకృతి మధ్య కనువిందు చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందలాదిగా గుంపులు గుంపులుగా నీటిపై తేలియాడుతూ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి పట్టుకుంటే జారిపోతూ నీటిలో సయ్యాటలాడుతూ... ఎండకు మెరిసిపోతున్నాయి. ఈ జెల్లీ ఫిష్లను చూడటానికి దూరప్రాంతాల నుండి పర్యటకులు వందలాదిగా తరలివస్తున్నారు.