విజయవాడ ఎల్.ఐ.సీ కాలనీకి చెందిన జీవామృతం సంస్థ....లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు ఆహారాన్ని అందిస్తోంది. గత నెల 31 నుంచి నగరంలోని పేదల ఇళ్ల వద్దకే వెళ్లి భోజనం పంపిణీ చేస్తోంది. రోజూ 100 నుంచి 150 మంది పేదలకు ఆహారం అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. లాక్ డౌన్ పొడిగించినా.. పేదలకు ఆహారం సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
నిరాశ్రయులకు జీవామృతం సంస్థ ఆపన్నహస్తం - lockdown
లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, నిరాశ్రయులు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి సహాయం అందించేందుకు ఎంతో మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమ వంతు తోడ్పాటును అందిస్తున్నాయి.
విజయవాడలో పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్న జీవామృతం సంస్థ