ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైలవరంలో రెవెన్యూ అధికారులతో జేసీ సమీక్ష - మైలవరం తాజా వార్తలు

కృష్ణాజిల్లా మైలవరంలో రెవెన్యూ, సచివాలయ, పంచాయతీ తదితర శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంట మార్పిడి నమోదు మూడు నెలలు పూర్తి అవుతున్నా జాప్యం జరగడంపై సిబ్బందిని ప్రశ్నించారు.

jc review with Revenue officials in  mailavaram
మైలవరంలో రెవెన్యూ అధికారులతో జేసీ సమీక్ష

By

Published : Sep 15, 2020, 4:39 PM IST

కృష్ణాజిల్లా మైలవరంలో రెవెన్యూ, సచివాలయ, పంచాయతీ తదితర శాఖల అధికారులు, సిబ్బందితో జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత, సబ్ కలెక్టర్ ధ్యాన్ చందర్ సమావేశం నిర్వహించారు. పలు అంశాల్లో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ-క్రాప్ నమోదు విషయంలో మైలవరం మండలం అట్టడుగు స్థాయిలో ఉందని సంబంధిత శాఖల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట మార్పిడి నమోదు మూడు నెలలు పూర్తి అవుతున్నా జాప్యం జరగడంపై సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది కార్యాచరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు..పనులు వేగవంతం చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details