జనతా కర్ఫ్యూ: ఇళ్లకే పరిమితమైన గుడివాడ ప్రజలు - జనతా కర్ఫ్యూ వార్తలు
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు గుడివాడ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
గుడివాడలో జనతా కర్ఫ్యూ
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు... కృష్ణాజిల్లా గుడివాడ ప్రజలు జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేశారు. కర్ఫ్యూ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చిరు వ్యాపారులు పలు దుకాణాలు తెరవగా... పోలీసులు మూసివేయించారు.