రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ అని.. దానితో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదని జనసేన రాష్ట్ర నాయకులు పోతిన వెంకట మహేశ్ విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు భరోసా కల్పించాల్సిన బడ్జెట్ వారికి శరాఘాతంగా మారిందని తెలిపారు. పద్దు ప్రవేశపెట్టిన రోజే ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. అగ్రకులాల పేదలను ఆదుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులిస్తామని చెప్పి.. ఆ విషయాన్ని విస్మరించారని చెప్పారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ అంశానికీ మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విధానంపై గందరగోళ నిర్ణయాలు తీసుకుని నిర్మాణరంగ వ్యవస్థని దెబ్బతీశారని ఆరోపించారు. ప్రజా సంక్షేమంపై దృష్టి సారించకుంటే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
బడ్జెట్.. అంకెల గారడీ: జనసేన నేత మహేశ్ - budjet
వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ప్రజలకు ఒరిగేదేమీ లేదని జనసేన రాష్ట్ర నాయకులు పోతిన వెంకట మహేశ్ తెలిపారు. ఇది ఓ అంకెల గారడీ అన్నారు.
'వైకాపా ప్రభుత్వ బడ్జెట్ అంకెల గారడీ'