లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రాజకీయాలు చేయడం బాధాకరమని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని రాజకీయ లబ్ధి కోసం తప్పించటం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు. కేవలం ఏకగ్రీవాల కోసం ఎన్నికల కమిషనర్‌ను తప్పించినట్టుగా ఉందని.. ఇది దుర్మార్గమనీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కుటుంబాలకు ఇప్పటిదాకా రూ.1000 సహాయం అందలేదని చెప్పారు. కేవలం మూడు మాస్కులు ఇచ్చి ప్రచారం చేసుకోవడం సమంజసం కాదని మండిపడ్డారు.
'3 మాస్కులు ఇచ్చి ప్రచారం చేసుకుంటారా?' - పోతిన మహేష్ వార్తలు
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రాజకీయాలు చేయటం బాధాకరమని... జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. కేవలం ఏకగ్రీవాల కోసం ఎన్నికల కమిషనర్‌ను తప్పించినట్టుగా ఉందని.. అది సరికాదని మండిపడ్డారు. రాష్ట్రంలో రూ.1000 సహాయం అందని వారికి తక్షణమే అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
!['3 మాస్కులు ఇచ్చి ప్రచారం చేసుకుంటారా?' janasena representative pothina mahesh fires on ysrcp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6795564-291-6795564-1586894664158.jpg)
ప్రభుత్వంపై మండిపడ్డ జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్