ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

#JSPFORAP ROADS: అధ్వాన రహదారులపై లక్షల కొద్దీ ట్వీట్లు..!

జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్‌ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై ట్విట్టర్ ద్వారా ఉద్యమాన్ని చేపట్టారు. ‘‘#jspforap roads హ్యాష్‌ట్యాగ్‌తో చేపట్టిన ఈ ఉద్యమానికి రెండు రోజుల్లోనే 1.73లక్షల ట్వీట్లు వచ్చాయి.

janasena-protest-through-social-media-on-ap-roads-position
అధ్వాన రహదారులపై లక్షల కొద్దీ ట్వీట్లు..!

By

Published : Sep 4, 2021, 8:01 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిని సామాజిక మాధ్యమం ద్వారా అందరికీ తెలియజేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ తెలిపారు. ‘‘#jspforap_roads హ్యాష్‌ట్యాగ్‌తో చేపట్టిన ఈ ఉద్యమానికి రెండు రోజుల్లోనే 1.73లక్షల ట్వీట్లు వచ్చాయి. వేలాది మంది తమ ప్రాంతాల్లో రోడ్లు ఏవిధంగా ఉన్నాయో తెలియజేస్తున్నారు. ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.

'గురువారం నుంచి మొదలైన ఈ కార్యక్రమం శనివారం వరకు కొనసాగుతుంది. రోడ్ల దుస్థితి 192.9మిలియన్ల మందికి చేరింది. ట్విటర్‌ ట్రెండింగ్‌లో రాష్ట్ర స్థాయిలో మొదటి, జాతీయస్థాయిలో ఐదో స్థానానికి చేరింది. అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా రాష్ట్రంలో రహదారులు ఉన్నాయని పవన్‌ కల్యాణ్‌ చెప్పిన విషయం అక్షర సత్యమనే విషయం ఈ డిజిటల్‌ ఉద్యమంలో వస్తున్న ఫొటోలు, వీడియోలను చూస్తే అర్థమవుతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఫొటోలు, వీడియోలు పంపించేందుకు సాధ్యంకాని వారి కోసం ఇచ్చిన వాట్సప్‌ నంబరుకు 10,455 చిత్రాలు, రెండు నిమిషాల నిడివి ఉన్న 5వేలకుపైగా వీడియోలు వచ్చాయి’’ - హరిప్రసాద్‌

ఇదీ చూడండి:HIGH COURT: తల్లుల ఖాతాల్లో బోధన రుసుములా!

ABOUT THE AUTHOR

...view details