అసైన్డ్ భుూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. కోడూరు, నాగాయలంక మండలాల్లోని 13,500 ఎకరాలకు ఈ అవకాశమివ్వాలని అవనిగడ్డలో నిరసన చేపట్టారు. జనసేన నేత, న్యాయవాది రాయపూడి వేణుగోపాల రావుతో సహా ఆ పార్టీ కార్యకర్తలు.. ఒక్కరోజు శాంతియుత నిరాహార దీక్ష చేశారు. స్థానిక ప్రజలు వారికి మద్ధతుగా నిలిచారు.
జనసైనికుల శాంతియుత నిరాహార దీక్ష - అవనిగడ్డలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు జనసేన దీక్ష
వర్షాలు, వరదల ధాటికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. మాతృభాషలో బోధన కొనసాగించాలని జనసేన శ్రేణులు శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. అవనిగడ్డలో అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని కోరారు..
జనసైనికుల దీక్ష