జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మెట్రోలో ప్రయాణించారు. వకీల్ సాబ్ చిత్రీకరణకు వెళ్తూ మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. తోటి ప్రయాణికుడైన దాక్షారామానికి చెందిన చిన సత్యనారాయణ అనే రైతుతో ముచ్చటించారు. పంటల గురించి, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
మెట్రోలో ద్రాక్షారామం రైతుతో పవన్ ఏం మాట్లాడారు? - మెట్రోలో రైతుతో మాట్లాడిన పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మెట్రోలో ప్రయాణించారు. ఈ క్రమంలో తోటి ప్రయాణికుడైన ఓ రైతుతో ముచ్చటించారు. ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరికీ మెట్రో ప్రయాణం తొలిసారే అని అన్నారు.

మెట్రోలో రైతుతో ముచ్చటించిన పవర్ స్టార్
ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయం బాగా దెబ్బతిందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలామంది పవన్ అభిమానులు ఉన్నారని... ఈ ప్రయాణంలో ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉందని రైతు ఆనందం వ్యక్తం చేశాడు. మెట్రో రైలు ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కల్యాణ్ నవ్వుతూ... తనకూ మెట్రోలో ప్రయాణం తొలిసారే అని అన్నారు. పవన్ వెంట చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రయాణించారు.
ఇదీ చదవండీ....హైదరాబాద్ మెట్రోలో పవన్ కల్యాణ్ షూటింగ్
Last Updated : Nov 5, 2020, 1:30 PM IST