రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో అడ్డా వద్ద కార్మికుల సమస్యలపై ఆయన చర్చించారు. రోజూ 400 మంది పనుల కోసం వస్తుంటే.. 40 మందికి మించి కూలీ దొరకడం లేదని కార్మికులు వాపోయారు. పనుల కోసం ఎదురుచూసి చివరకు ఇంటికి పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అందుబాటులో లేకే భవన నిర్మాణ కూలీలు రోడ్డున పడ్డారని నాదెండ్ల మండిపడ్డారు.
Nadendla Manohar: 'ఇసుక అందుబాటులో లేకే కార్మికులు రోడ్డున పడ్డారు' - latest news in vijayawada
విజయవాడ బెంజ్ సర్కిల్‌లో అడ్డా వద్ద కార్మికుల సమస్యలపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చించారు. ఇసుక అందుబాటులో లేకే కూలీలకు పనులు దొరకడం లేదని ఆయన మండిపడ్డారు.
Janasena leader Nadendla Manohar