Janasena party Protest: నూతనంగా ఏర్పడనున్న విజయవాడ జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలంటూ కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని రంగా విగ్రహనికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.. జిల్లాకు రంగా పేరు పెట్టాలంటూ నినాదాలు చేశారు.
రంగా బొమ్మ పట్టుకొని ఎన్నికల్లో ప్రచారం చేసే మంత్రి నాని నూతన జిల్లాకు ఆయన పేరు పెట్టడంలో బాధ్యత తీసుకోవాలని.. గుడివాడ జనసేన పార్టీ ఇంఛార్జి బురగడ్డ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాకు రంగా పేరు పెట్టేంతవరకు పోరాడుతామని అన్నారు.