ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు తాము వ్యతిరేకం కాదని...తెలుగు మాధ్యమాన్నిమాత్రం కచ్చితంగా కొనసాగించాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ఆంగ్ల భాషను విద్యార్ధులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వంపై మరింత ఉందని గుర్తుచేశారు. తెలుగు మాధ్యమంలో చదవడానికి ఒక్క విద్యార్ధి సిద్ధంగా ఉన్నా సరే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ విద్యార్ధిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించినట్లు తెలిపారు. అలా కాకుండా ప్రభుత్వం మొండిగా ముందడుగు వేస్తే అన్ని పార్టీలను కలుపుకొని తెలుగు భాష పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
"ఆంగ్లమాధ్యమ అమలుకు జనసేన వ్యతిరేకం కాదు" - ఏపీలో ఆంగ్లమాధ్యమంపై వార్తలు
ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాల్లో అమలు చేసేందుకు జనసేన వ్యతిరేకం కాదని... అయితే మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని... జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్