ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వక్ఫ్ బోర్డు భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు' - విజయవాడలో ముస్లిం వక్ఫ్ బోర్డు భూములు వార్తలు

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరో భారీ కుంభకోణానికి తెరతీశారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడం నిర్మించారని.. అనర్హులైన వ్యక్తులకు వక్ఫ్ బోర్డు భూములను కట్టబెట్టి.. వాటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

pothina mahesh outrage on minister vellampalli srinivas rao
జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్

By

Published : Apr 7, 2021, 3:23 PM IST

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరో భారీ కుంభకోణానికి తెరతీశారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. నిన్నటిదాకా దేవాలయాలకు చెందిన భూములను అన్యాక్రాంతం చేసేపనిలో మంత్రి నిమగ్నమయ్యారని... ఇప్పుడు అనర్హులైన వ్యక్తులకు వందల కోట్లు విలువ చేసే వక్ఫ్ బోర్డు భూములను కట్టబెట్టి వాటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

వెల్లంపల్లి శ్రీనివాస్​రావుపై పోతిన మహేశ్ ఆగ్రహం

ఈ విషయంపై.. సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించకుంటే ...మంత్రి వెల్లంపల్లి అవినీతికి మద్దతు పలికినవారవుతారని ఆయన స్పష్టం చేశారు. దుర్గగుడి ఇరిగేషన్ శాఖకు చెందిన భూమిలో మంత్రి వెల్లంపల్లి అక్రమ కట్టడం నిర్మించారని అన్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన షెడ్డుకి మంత్రి కుటుంబీకుల పేరు వేయించుకుని దర్జాగా ప్రారంభిస్తే... స్థానిక వైకాపా నాయకులు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details