స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరపడమంటే అపహరణలు, ప్రలోభాలకు గురి చేయటమా అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ఎద్దేవా చేశారు. విజయవాడ నగరంలో జనసేన-భాజపా బలపరిచిన అభ్యర్థిని కిడ్నాప్‌నకు యత్నించడం నిజం కాదా అని ప్రశ్నించారు. దొంగ ధ్రువీకరణ పత్రాలతో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థిపై ఫిర్యాదు చేసినప్పటికీ... ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని.. అక్రమాలకు పాల్పడుతున్న అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
'అక్రమాలకు పాల్పడుతున్న అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలి' - విజయవాడ నేటి వార్తలు
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరుపై జనసేన నేత పోతిన మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆక్షేపించారు.
జనసేన నేత పోతిన మహేశ్