ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనావాసల్లో ఐసోలేషన్ సెంటరా..? - ఈరోజ పోతిన మహేష్ తాజా వ్యాఖ్యలు

ఐసోలేషన్ కేంద్రాల విషయంలో.. పేద సామాన్య మధ్యతరగతి మహిళలకు న్యాయం చేయగలరా అని జనసేన నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. సామాన్య మధ్యతరగతి మహిళల సొంత ఇంటి కలను కరోనా వైరస్‌తో దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు.

Breaking News

By

Published : Apr 23, 2021, 3:13 PM IST

గృహ సముదాయాల్లో కరోనా ఐసోలేషన్ కేంద్రాలా..? అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. సామాన్య మధ్యతరగతి మహిళల సొంత ఇంటి కలను కరోనా వైరస్‌తో దాడి చేయిస్తారా? అని మేయర్‌ను నిలదీశారు. కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తే.. అక్కడ పేద ప్రజలు గృహ ప్రవేశాలు ఎప్పటికి చేస్తారు అని మండిపడ్డారు. కరోనా ఇసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు.. ఇండోర్ స్టేడియం, కల్యాణ మండపాలు, చిన్న చిన్న హోటళ్లు, పెద్ద ఎత్తున గదుల వెసులుబాటు ఉన్న చోటు ఏర్పాటు చేయలేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయంపై పునఃసమీక్ష చేయాలని.. పోతిన మహేష్‌ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details