జనసేన పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి తోట మురళీ కృష్ణ మృతి చెందారు. ఆయన కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున విజయవాడ ఆంధ్ర ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో కన్నుమూశారు. మృతదేహాన్ని నందిగామ రైతుపేటలోని ఆయన స్వగృహానికి తీసుకుని వస్తున్నట్లు సమాచారం.
కృష్ణాజిల్లా జనసేన కీలక నేత మృతి.. - కాలేయ సంబంధిత వ్యాధితో జనసేన నాయకుడు మృతి
జనసేన పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి తోట మురళీ కృష్ణ మృతిచెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
![కృష్ణాజిల్లా జనసేన కీలక నేత మృతి.. janasena-leader-murali-krishna-died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13369208-162-13369208-1634363101317.jpg)
janasena-leader-murali-krishna-died
చిరంజీవి ఫ్యాన్స్ నందిగామ అధ్యక్షుడిగా, అనంతరం ప్రజారాజ్యం పార్టీలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. మురళీకృష్ణ మృతిపట్ల నందిగామ కాపుసేవ సమితి సంతాపం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి:Coal reserves: సోమవరంలో నల్ల బంగారం