రాజధాని ఇక్కడా.. అక్కడా అని చెప్పి.. రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెట్టారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో తెదేపా నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న ముఖ్యమంత్రి... విశాఖలో వైకాపా నేతలు చేసిందేంటని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇప్పటి దాకా కూల్చివేతలకు ఇచ్చిన ప్రాధాన్యం.. నిర్మాణాలు చేపట్టడానికి ఇవ్వలేదన్నారు.
'3 రాజధానులు... సీఎం మాటే నిపుణుల నివేదికా?'
రాజధానిపై వైకాపా ప్రభుత్వం రోజుకో ట్విస్ట్ ఇస్తుందని... జనసేన నేతలు అన్నారు. సినిమా ఇంటర్వెల్, క్లెమాక్స్లా... అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి బొత్స, ముఖ్యమంత్రి జగన్ రోజుకో మాట మాట్లాడరని విమర్శించారు. 13 జిల్లాలున్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. విశాఖలో వైకాపా నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.
జనసేన నేతలు