మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ విజయవాడ వన్‌టౌన్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జనసేన శ్రేణులు ఆందోళన చేశాయి. దీక్షా శిబిరాన్ని నాదెండ్ల మనోహర్ ఇతర నాయకులు సందర్శించారు. మన రాజధాని అనే భావనతోనే రైతులు భూములు త్యాగం చేశారని మనోహర్ అన్నారు. రైతులు, మహిళలు ఆవేదన మమ్మల్ని కలచివేసిందని తెలిపారు. ఈ 7 నెలల్లో రంగులు వేసుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఫించన్లలోనూ కోతలు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం మారితే రాజధాని మార్చాల అని ప్రశ్నించారు.
'ప్రభుత్వం మారితే రాజధాని మార్చాలా..!' - విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో నిరసన దీక్ష...
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. విజయవాడ వన్‌టౌన్‌లో జనసేన పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాదెండ్ల మనోహర్ ప్రభుత్వం మారితే రాజధాని మార్చాలా అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో సర్కారు వైఖరి సరి కాదని అన్నారు.
విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో నిరసన దీక్ష
ఇవీ చదవండి:
TAGGED:
Janasena_Capital_Nisarana