స్థానిక ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీల నేతలు తెలిపారు. పొత్తులపై విజయవాడలో సమావేశమై.. సుమారు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిలో సమన్వయ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని భాజపా నేత పురంధేశ్వరి ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే ఇంత తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు జరగలేదన్నారు. అన్ని సీట్లలో ఇరుపార్టీలు కలిసి.. పోటీ చేస్తామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తమ పార్టీ అవినీతికి దూరంగా ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు. ఈ నెల 12న మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
స్థానిక సమరంలో.. భాజపా, జనసేన ఒకే బాటలో - local body election latest news
స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు భాజపా, జనసేన పార్టీలు నిర్ణయించాయి. పొత్తులపై విజయవాడలో సమావేశమైన ఇరు పార్టీల నేతలు ఈ నెల 12న మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు.
పొత్తులపై సమావేశమైన భాజపా, జనసేన